కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రత పాటించాలని సూచిస్తున్నారు. విశాఖ ప్రజలు కచ్చితంగా మాస్కులు ధరించాలని సీపీ ఆర్కే మీనా స్పష్టం చేశారు. మాస్కు లేకుండా బయటకు వస్తే రూ.100 జరిమానా విధిస్తామని తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరోనా లక్షణాలతో ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఇదీ చదవండి: టెస్టుల్లోని తీవ్రత ఇతర ఫార్మాట్లలో కష్టం: కోహ్లీ