Temperatures Decrease In Visakha Agency: విశాఖ మన్యంలో చలిపులి పంజా విసురుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. మంగళవారం తెల్లవారుజామున మినుములూరు కాఫీ బోర్డు వద్ద 12.27 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
ఓ వైపు చలి వణికిస్తుంటే..మరోవైపు పొగమంచు పరిసరాలను కమ్మేస్తోంది. ప్రధానంగా పచ్చదనం, చెట్ల ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. రహదారులపై విపరీత మంచుతో ముందు వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి