తెలుగు అకాడమీలో... సంస్కృత అకాడమీని విలీనం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు దండు కార్యకర్తలు విశాఖ మద్దిలపాలెం కూడలి తెలుగుతల్లి విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. తెలుగు అకాడమీ పేరును మార్చడంపై నిరసన చేపట్టారు. ఈ రెండు అకాడమీలు కలిపి ఏర్పాటు చేయడం వల్ల ప్రణాళికలు.. నిధుల సాధన ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అకాడమీల విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ.. dead bodies : క్వారీగుంతలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం