ETV Bharat / state

విశాఖ ఏజెన్సీ నుంచి తెలంగాణకు గంజాయి సరఫరా

author img

By

Published : Feb 12, 2020, 9:57 AM IST

గంజాయిని తరలించటానికి నిందితులు కొత్త కొత్త పద్ధతులు ఎన్నుకుంటున్నారు. తాజాగా కారు ఇంజిన్​లో గంజాయిని అమర్చి రాష్ట్రం దాటించేందుకు నిందితులు ప్రణాళిక వేశారు. చివరకు పోలీసులకు చిక్కారు.

telangana ganja gang arrest in sileru
విశాఖ ఏజెన్సీలో పట్టుబడిన తెలంగాణ గంజాయి ముఠా

విశాఖ ఏజెన్సీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి గంజాయి తరలించేందుకు నిందితులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. కారు ఇంజిన్​లో గంజాయిని తరలించేందుకు సిద్ధమయ్యారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడి కటకటాల పాలయ్యారు.

విశాఖ ఏజెన్సీ నుంచి తెలంగాణకు కారులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో సీలేరు పోలీసులు అప్రమత్తమయ్యారు. సీలేరు వద్ద వాహన తనిఖీలు చేపట్టగా కారు ఇంజిన్​లో భద్రపరిచిన గంజాయిని పోలీసులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డికి తరలించేందుకు సిద్ధం చేసిన 2 కిలోల చొప్పున 53 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మురళీధర్ వివరించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. వీరంతా తెలంగాణలోని సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.

ఇదీ చదవండి: మాతృత్వానికి మచ్చుతునక... ఆవుదూడకు పాలిచ్చిన శుకనం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.