ETV Bharat / state

ఉపాధ్యాయుల బదిలీలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు - విశాఖలో ఉపాధ్యాయుల బదిలీలకు దరఖాస్తులు న్యూస్

మూడేళ్ల తర్వాత బదిలీలు జరుగుతున్నందున ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ మేరకు విశాఖ జిల్లాలో బదిలీలు.. ఉపాధ్యాయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.

ఉపాధ్యాయుల బదిలీలకు పెద్ద ఎత్తున ధరఖాస్తులు

author img

By

Published : Nov 20, 2020, 11:38 AM IST

విశాఖ జిల్లా వ్యాప్తంగా 3035 ఖాళీల గానూ సుమారు 5000 మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేశారు. బదిలీల దరఖాస్తు గడువు ఈనెల 16తో ముగిసింది జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ పాఠశాలలో మొత్తం 10,307 ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాల విద్యాశాఖ నిబంధనల మేరకు ఒకేచోట ఐదు నుంచి ఎనిమిది ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా అక్కడినుంచి బదిలీ చేస్తారు. ఈ కోవ కిందకు వచ్చే సుమారు 13 వందల 85 మంది టీచర్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

అలాగే కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా మరో 3638 మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసుకున్న టీచర్లు ఎక్కువగా పట్టణ కేంద్రాల్లో, ప్రధాన రహదారికి సమీపంలో గల పాఠశాలలకు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే విశాఖ నగర పరిధిలో పనిచేసే కొంతమంది ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్లారు. నగరం చుట్టుపక్కల పాఠశాలల్లోనే.. ఉంటామని అడుగుతున్నారు. కాగా దీనిపై పాఠశాల విద్యాశాఖ కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయించింది. జీవీఎంసీ పరిధిలో తక్కువగా ఖాళీలు ఉన్నందున సర్వీస్ పాయింట్ల వారీగా పోస్టింగ్స్ లభిస్తాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు రెండు రోజుల నుంచి పరిశీలిస్తున్నారు. నిబంధనలకు లోబడి దరఖాస్తు చేశారా! లేదా అనే చూసిన తర్వాత దరఖాస్తును తిరిగి అప్లోడ్ చేస్తారు .

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా జాయింట్ కలెక్టర్ పరిశీలనకు పంపి, తుది జాబితా ఖరారు చేస్తారు. ఆ తర్వాత క్యాడర్ వారీగా సీనియర్ జాబితా ఆన్​లైన్​లో పొందుపరుస్తారు. దీనిపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత పాయింట్ల ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. వచ్చే నెల 14వ తేదీలోగా బదిలీల ప్రక్రియ పూర్తి కావచ్చునని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: జనసిరితో మురవనున్న తుంగభద్రమ్మ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.