దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తెదేపా దళిత మహిళలు విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. తెదేపా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక దళిత మహిళ రాష్ట్ర హోం మంత్రిగా ఉంటూ.. ఎస్సీ మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై స్పందించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: క్రీడాకారులకు సచివాలయ ఉద్యోగాల్లో ప్రాధాన్యత