తెలుగుదేశం పార్టీ నేతల అరెస్టులకు వ్యతిరేకంగా విశాఖ జిల్లా పాయకరావుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద తెదేపా నేతలు నిరసన చేపట్టారు. తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి లను అక్రమంగా అరెస్టు చేశారని అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. తమ పార్టీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇళ్ల స్థలాల పంపిణీలో.. అర్హులైన వారికి న్యాయం జరగలేదని పేర్కొన్నారు. వైకాపాకు చెందిన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించారని ఆరోపించారు. ఈ అంశంపై విచారణ చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: విశాఖ గ్యాస్ లీకేజీ : పరిహారం కోసం పడిగాపులు