పేదలకు టిడ్కో భవనాలు అందించాలని తెదేపా చేపట్టిన 'నా ఇళ్లు.. నా సొంతం' కార్యక్రమానికి వైకాపా ప్రభుత్వం దిగి వచ్చిందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో మాట్లాడిన ఆయన... ఇళ్ల స్థలాల పంపిణీకి అడ్డుపడుతున్నాయని ప్రతిపక్షాలపై వైకాపా లేనిపోని నిందలు వేశారని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై వైకాపా నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని నాగజగదీశ్వరరావు డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్ల నిర్మాణానికి పట్టణంలో రెండు సెంట్లు.. గ్రామీణ ప్రాంతాల్లో రెండున్నర సెంట్లు భూమి కేటాయించాలన్నారు.
ఇదీ చదవండి : విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు...తండ్రి పేర్లు మార్చేశారు?