ETV Bharat / state

ఉపాధి హామీ బిల్లుల కోసం... తెదేపా నేతల ధర్నా - తెదేపా నాయకుల తాజా న్యూస్

ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో అనేక పనులు చేశారు. ఆ పనుల బిల్లులు కేంద్రం విడుదల చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు. అధికారులు నిర్లక్ష్యం ఫలితంగా పనులు చేసినవారు నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ... సర్పంచ్​లు, తెదేపా నేతలు పలుచోట్ల ఆందోళన చేశారు.

తెలుగుదేశం ధర్నా
author img

By

Published : Nov 2, 2019, 10:21 PM IST

ధర్నా చేస్తున్న తెదేపా నేతలు

కేంద్రం విడుదల చేసిన ఉపాధి హామీ పథకం నిధులను... రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలంటూ తెదేపా నేతలు పలుచోట్ల ధర్నా చేశారు.

కర్నూలు జిల్లాలో...
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేసిన పనులకు... బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ... కర్నూలు జిల్లా కల్లూరు ఎంపీడీవో కార్యాలయం ఎదుట సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.

విశాఖ జిల్లాలో...
ఉపాధి హామీ పెండింగ్​ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని... తెదేపా ఆధ్వర్యంలో ప్రజలు ఆందోళన చేశారు. ఈ మేరకు రోలుగుంట ఎంపీడీవో కార్యాలయం ధర్నా చేశారు. అనంతరం ఎంపీడీవోకు వినతి పత్రం ఇచ్చారు. సిమెంటు రోడ్ల నిర్మాణం, జలాశయాల్లో పూడికతీత... తదితర పనుల బిల్లులను నిలిపివేయడం సమంజసం కాదన్నారు. ఎంతో మంది స్థానిక ప్రజాప్రతినిధులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందనీ తెదేపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణాజిల్లాలో...
తెదేపా ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సంధించిన బిల్లులు వెంటనే చెలించాలని... చిల్లకల్లు ఎంపీడీవో కార్యాలయం వద్ద తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి

ఇంట్లో గంజాయి సంచులు.. పోలీసుల అదుపులో మైనర్లు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.