వైకాపా ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ప్రతిపక్షం పరీక్షల రద్దు కోరిందని... కక్షసాధింపు చర్యల్లో భాగంగా పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పరీక్షలకు బయటకొచ్చే దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల రక్షణకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేపట్టిందని నిలదీశారు. పరీక్షల నిర్వహణ ద్వారా కోటి మంది వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కరోనా సోకదని ప్రభుత్వం హామీ ఇస్తుందా అని వంగలపూడి అనిత ప్రశ్నించారు.
ఇదీ చదవండి: