ETV Bharat / state

'అచ్చెన్నాయుడు అరెస్ట్ దుర్మార్గం' - tdp leader pradarao about Achchennadayudu Arrest

ఉత్తరాంధ్ర తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని అరెస్టు చేయటం దుర్మార్గమని మాడుగుల నియోజకవర్గ తెదేపా నేత పైలా ప్రసాదరావు అన్నారు.

vishaka district
'అచ్చెన్నాయుడు అరెస్ట్ దుర్మార్గం'
author img

By

Published : Jun 13, 2020, 1:10 PM IST

అసెంబ్లీలో ప్రభుత్వానికి గట్టి సవాలు విసురుతున్న అచ్చెన్నాయుడును కక్షసాధింపు చర్యలతో ఉద్దేశ్యపూర్వకంగా అరెస్టు చేశారని విశాఖ జిల్లా చీడికాడలో తెదేపా నేత పైలా ప్రసాదరావు అన్నారు. ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నోక్కేస్తుందని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో వెనకబడిన తరగతులకు పెద్ద దిక్కుగా ఎదిగిన కింజరాపు కుటుంబంపై ఇంతవరకూ ఎటువంటి మచ్చ లేదని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసే ఉద్దేశంతో సాగుతున్న ఈ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని చెప్పారు. తెలుగుదేశం నాయకులు, అభిమానులు, కార్యకర్తలందరూ అచ్చెన్నాయుడి కుటుంబానికి అండగా నిలుస్తామని..ప్రభుత్వ కుట్రలను తిప్పికొడతామని పైలా స్పష్టం చేశారు.

ఇది చదవండి అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.