వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ దుర్మార్గంగా మాట్లాడారని తెదేపా నేత బండారు సత్యనారాయణ అన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా పనులుచేస్తే కోర్టులు ఊరుకుంటాయా? అని ప్రశ్నించారు. 40, 50 ఏళ్ల నుంచి దళితులు, బీసీల ఆధీనంలో ఉన్న భూములను లాక్కుంటే వారు కోర్టుకు వెళ్లరా? అని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పేరుతో రాజమహేంద్రవరం ఎంపీ ఎంత దోచుకున్నారో జగన్కు తెలియదా? అని ప్రశ్నించారు. భూసేకరణ, చదును పేరుతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులనూ దోచేశారని సత్యనారాయణమూర్తి ఆరోపించారు.
'30లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇస్తున్నట్లు గొప్పలు చెప్పడం కాదు. అసలు నిజమైన అర్హులెవరో, పేదలకు స్థలాలు అందుతున్నాయో లేదో ప్రజల మధ్యనే చర్చిద్దాం. వైకాపా ప్రభుత్వం చెబుతున్న 30 లక్షల పేర్లలో 70శాతం వరకు తప్పుడుపేర్లే. నా వాదన తప్పని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటా. 10 లక్షల 57 వేల మందికి ఇళ్లు లేవని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వమే నివేదిక ఇచ్చింది.' - బండారు సత్యనారాయణ
ఇదీ చదవండి: వైకాపా రాజ్యసభ సభ్యుల్లో 50% మందిపై తీవ్రమైన కేసులు