తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు.. సీఎం జగన్పై ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చెయ్యకుండా.. విజయం సాధించామని చెప్పే దమ్ము వైకాపాకు ఉంటే 151 మంది ఎమ్మెల్యేలు, 28 మంది ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. రాజీనామాలు చేసి ప్రధాని నరేంద్ర మోదీ మెడలు వంచాలని జగన్, విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బలుపు కాదు గెలుపు అనే నమ్మకం ఉంటే... ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచామనే ధైర్యం ఉంటే... రాజీనామా చేసి, విశాఖ ఉక్కు అమ్మకుండా అడ్డుకోవాలన్నారు. అన్నీ గెలిచామని కాలర్ ఎగరేసేవారు.. రాజీనామా అనగానే ఎందుకు పిరికివారిలా ఇంటికే పరిమితమవుతున్నారని నిలదీశారు. మోదీని చూసి వణుకుతూ.. తాడేపల్లి ఇంట్లో ఉన్నవారు ప్రత్యేక హోదాని ఎలాగో అటకెక్కించారని ధ్వజమెత్తారు. కనీసం విశాఖ ఉక్కు కోసమైనా రాజీనామా చేయించాలని డిమాండ్ చేయాలంటూ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: