ETV Bharat / state

'న్యాయస్థానాలపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు బాధాకరం'

పెద్దల సభలో న్యాయస్థానాలను కించపరిచేలా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారని తెదేపా నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. కోర్టుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని విజయసాయిరెడ్డి అనడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం జగన్ అసంబద్ధ నిర్ణయాల్లో వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆరోపించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ 50 నుంచి 60 సలహాదారులు పెట్టుకున్న వైకాపా ప్రభుత్వం... కోర్టులతో మొట్టికాయలు తింటుందని ఎద్దేవా చేశారు.

author img

By

Published : Sep 17, 2020, 3:37 PM IST

Updated : Sep 17, 2020, 6:31 PM IST

అయ్యన్న పాత్రుడు
అయ్యన్న పాత్రుడు

రాజ్యసభలో విజయసాయిరెడ్డి న్యాయవ్యవస్థను విమర్శిస్తూ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

అయ్యన్న పాత్రుడు ట్వీట్
అయ్యన్న పాత్రుడు ట్వీట్

'పెద్దల సభలో విజయసాయిరెడ్డి కోర్టులపై చేసిన వ్యాఖ్యలు బాధాకరం. వైకాపా ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకతతో, పక్షపాతంతో కోర్టులు వ్యవహరిస్తున్నాయని విజయసాయిరెడ్డి అనడం విడ్డూరంగా ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న వ్యక్తులు న్యాయవ్యవస్థను విమర్శించడం ఎంతవరకు సమంజసం.' - అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి

సలహాదారులు ఏంచేస్తున్నారు

జగన్ అసమర్థత వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు. 50 నుంచి 60 మంది సలహాదారులను నియమించుకున్న ప్రభుత్వం వారికి కోట్ల రూపాయలు చెల్లిస్తోందని గుర్తుచేశారు. వారి సలహాలు ఏమో గానీ, కోర్టుల్లో ప్రభుత్వానికి మొట్టికాయలు తప్పడం లేదని విమర్శించారు. హైకోర్టులో చీవాట్లు తిన్నదిగాక, సుప్రీంకోర్టుకు వెళ్తూ, ప్రజలసొమ్మును మరింత దుబారా చేస్తున్నారని మండిడ్డారు. నీరు-చెట్టు, ఇతర ఇరిగేషన్ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.35 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉందన్న అయ్యన్న, ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు.జగన్ అసమర్థత వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు.

50 నుంచి 60 మంది సలహాదారులను నియమించుకున్న ప్రభుత్వం వారికి కోట్ల రూపాయలు చెల్లిస్తోందని గుర్తుచేశారు. వారి సలహాలు ఏమో గానీ, కోర్టుల్లో ప్రభుత్వానికి మొట్టికాయలు తప్పడం లేదని విమర్శించారు. హైకోర్టులో చీవాట్లు తిన్నదిగాక, సుప్రీంకోర్టుకు వెళ్తూ, ప్రజలసొమ్మును మరింత దుబారా చేస్తున్నారని మండిడ్డారు. నీరు-చెట్టు, ఇతర ఇరిగేషన్ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.35 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉందన్న అయ్యన్న, ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : 'సింహాల ప్రతిమలు కనిపించటం లేదు.. దర్యాప్తు చేయండి'

Last Updated : Sep 17, 2020, 6:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.