తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతలు చేస్తున్న దాడులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ..విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెదేపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇంటిపై దాడికి యత్నించిన వారిపై.. కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: