Visaka ramanaidu studio lands issue latest news: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం బీచ్ రోడ్డులో ఉన్న రామానాయుడు స్టూడియో ఆవరణలో లేఔవుట్ అక్రమాల వెనుక సీఎం జగన్ సతీమణి భారతి రెడ్డి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. సినిమా అవసరాలకు నాడు భూములు కేటాయిస్తే... ఇప్పుడు వాటిని స్థిరాస్తి వ్యాపారం కోసం అడ్డగోలుగా వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ స్కాం వెనక సాక్షి ఛైర్మన్ వైఎస్ భారతి రెడ్డి ఉన్నారు.. బండారు సత్యనారాయణ మూర్తి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి.. సురేష్ ప్రొడక్షన్ సంస్థకు విలువైన భూముల్ని అతి తక్కువ ధరకు కేటాయించారని ఆయన గుర్తు చేశారు. కేవలం సినిమా అవసరాలకు నాడు భూములు కేటాయిస్తే.. ఇప్పుడు వాటిని స్థిరాస్తి వ్యాపారం కోసం అడ్డగోలుగా వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేఔవుట్ అభివృద్ధి చేసిన తర్వాత ఇక్కడ రానున్న విల్లాలు, స్థలాల్లో 50 శాతం బినామీ పేర్లతో నొక్కేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు పలు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆయన.. ఈ స్కాం వెనక సాక్షి ఛైర్మన్ వైఎస్ భారతి రెడ్డి ఉన్నారని బండారు ఆరోపించారు. వైఎస్ భారతి కనుసన్నల్లోనే భూదందాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
వాటిన్నంటిని భవిష్యత్తులో రద్దు చేస్తాం.. ''విశాఖలో రామానాయుడు స్టూడియోకి గతంలో ఇచ్చిన స్ధలాన్ని నేటీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్‌గా మారుస్తున్నారు. చలన చిత్ర పరిశ్రమ అభివృద్ది కోసం ఇచ్చిన స్ధలమది. చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడం కోసమే 33 ఎకరాలను నామ మాత్రంగా కేటాయించారు. ఆ ప్రాంతంతో ఎక్కువ రేండ్ టవర్స్‌ను నిర్మిచేందుకు ఎలా ఎల్పీ అనుమతులు ఎలా ఇచ్చారో అధికారులు చెప్పాలి..?. సీఆర్‌జడ్ రూల్స్‌కు విరుద్దంగా భారీ విల్లాలకి ఎలా తెగబడతారు..?. చట్టవిరుద్దంగా ఇష్టారీతిగా నిర్మాణాలను కట్టడమే కాకుండా, చట్టం కళ్లుగప్పి నిబంధనలకు విరుద్ధంగా అమ్ముకోవాలని ప్రయత్నిస్తున్నారు. బినామీల పేరున రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు. వాటిని భవిష్యత్తులో రద్దు చేస్తాం. రామానాయుడు స్టూడియోస్‌లో ప్రభుత్వం నుంచి పర్మిషన్ లేదని గతంలో మంత్రి అమర్ నాథే చెప్పారు. భారతి రెడ్డి కనుసన్నలోనే ఈ భూదందాలు జరుగుతున్నాయి. కేంద్ర పర్యావరణ అటవీ నిబంధనలకు విరుద్దంగా ఏమి జరిగినా సహించబోం. ఏ రకంగా భూ మార్పిడి చేశారో సమాధానం చెప్పాలి.'' అని బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.
అసలు ఏం జరిగిదంటే.. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ.. తెలుగుదేశం ప్రభుత్వం 2003వ సంవత్సరం సెప్టెంబరు 13వ తేదీన విశాఖ-భీమిలి బీచ్ రోడ్డులో 34.44 ఎకరాలు రామానాయుడు స్టూడియోకు కేటాయించింది. అప్పటి మార్కెట్ విలువ ప్రకారం.. ఎకరాకు రూ.5 లక్షల 20వేల రూపాయలు. ఆ ప్రకారం డబ్బులను చెల్లించి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సేల్ డీడ్ చేసుకుంది. దాదాపు 13 ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఆ భూమిలో కొంతమేర లేఔవుట్‌కు అనుమతులు పొందడం.. వివాదాస్పదంగా మారింది.
ఇవీ చదవండి