విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని నియమించాలని స్థానిక తెదేపా నేతలు కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రాన్ని అందజేశారు. సమస్యకు పరిష్కారం చూపని పక్షంలో నిరాహారదీక్షలు చేస్తామని హెచ్చరించారు. వైద్య సిబ్బందిని నియమించకుండ ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్యంతో ఆడుకోవడం మంచిది కాదని అన్నారు.
ఇదీ చదవండి: