ETV Bharat / state

గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలకు తెదేపా ఆర్థిక సాయం - ఎల్​జీ పాలిమర్స్ బాధితులకు తెదేపా సాయం

విశాఖలోని ఎల్​జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయాన్ని అందించనుంది తెలుగుదేశం పార్టీ. బాధితులకు 50 వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించారు.

tdp decided to provide financial help to lg polymers gas leakage victims

author img

By

Published : Jun 14, 2020, 9:13 PM IST

Updated : Jun 14, 2020, 9:37 PM IST

విశాఖపట్నంలో జరిగిన గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని తెదేపా నిర్ణయించింది. మృతుల కుటుంబాలకు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం తక్షణమే ఇవ్వాలని పార్టీ నేతలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆదేశించారు. నగదును మృతుల కుటుంబ సభ్యుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పారు. ఈ దుర్ఘటనలో విష వాయువుల కారణంగా 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వీరి కుటుంబాలకు తలా 50 వేల చొప్పున 7.50 లక్షల రూపాయలను బ్యాంకు ఖాతాల్లో సోమవారం నాటికి జమ చేయనున్నారు.

స్థానిక శాసనసభ్యుడు గణబాబు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పార్టీ నాయకులు మృతుల కుటుంబాలను కలిసి ఆర్థిక సాయంపై చంద్రబాబు లేఖను అందజేశారు. గ్యాస్ లీకేజీ బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని తెలియజేయాల్సిందిగా విశాఖ పార్టీ నాయకులకు చంద్రబాబు సూచించారు.

ఇదీ చదవండి

'స్టైరీన్ గ్యాస్​ కంటే తాగు నీరే ప్రమాదకరంగా ఉంది'

Last Updated : Jun 14, 2020, 9:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.