ETV Bharat / state

విశాఖ చేరకున్న చంద్రబాబు.. ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు - చంద్రబాబు న్యూస్

మలివిడత జిల్లాల పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

విశాఖ చేరకున్న చంద్రబాబు
విశాఖ చేరకున్న చంద్రబాబు
author img

By

Published : Jun 15, 2022, 4:16 PM IST

'ఎన్టీఆర్ స్ఫూర్తి - చంద్రన్న భరోసా' పేరుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా మలి విడత పర్యటనలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మహానాడు స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, జిల్లా మహానాడు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకున్న చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు.

కాసేపట్లో గాజువాకలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో పాల్గొననున్న చంద్రబాబు.. రోడ్​షో అనంతరం చోడవరంలో కార్యకర్తలతో భేటీకానున్నారు. విశాఖ జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్న తెదేపా అధినేత.. అనకాపల్లిలో ఏర్పాటు చేసిన మినీ మహానాడులో పాల్గొననున్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.