ETV Bharat / state

బాలిక మృతి కేసును ఛేదించిన పోలీసులు.. అపార్ట్​మెంట్​ పైనుంచి దూకడం వల్లే

Suspicious death of a girl in Aganampudi

author img

By

Published : Oct 6, 2021, 6:37 AM IST

Updated : Oct 7, 2021, 5:31 AM IST

06:34 October 06

బాలిక మృతి కేసును ఛేదించిన పోలీసులు

బాలిక మృతి కేసును ఛేదించిన పోలీసులు

విశాఖ పారిశ్రామిక ప్రాంతమైన అగనంపూడి వద్ద జరిగిన మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మృతికి కారణమైన నరేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి పోక్సోతో సహా పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఆ బాలికను లొంగదీసుకుని మూడు నెలలుగా అమెకు మాయమాటలు చెప్పిన అతను చివరకు అమ్మాయి మృతికి కారణమయ్యాడని పోలీసులు వివరించారు. మొత్తం పంచనామా, శవపరీక్షను  చిత్రీకరణ చేసినట్టు వివరించారు.

మాయ మాటలతో లొంగదీసుకుని..

విజయనగరానికి చెందిన నరేష్ వుడ్ వర్క చేసేందుకు వచ్చి బాలిక ఉండే అపార్ట్​మెంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో మాటలు చెప్పి బాలికను లొంగదీసుకున్నాడని పోలీసులు చెప్పారు. బాలికను తెల్లవారు జామున అపార్ట్ పైకి రమ్మన్నట్లు విచారణలో ఒప్పుకున్నట్లు చెప్పారు. బాలికను లొంగదీసుకోవడం, ఆమె చనిపోవడానికి పరోక్షంగా కారణం మైన నరేష్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 

ఇదీ చదవండి:  బైక్​ను ఢీకొట్టిన గంజాయి స్మగ్లింగ్ కారు.. ముగ్గురికి తీవ్రగాయాలు

Last Updated : Oct 7, 2021, 5:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.