ETV Bharat / state

నలుగురు మావోయిస్టు మిలీషియా స‌భ్యుల లొంగుబాటు - మావోయిస్టులు

గూడెం కొత్త వీధి మండలానికి చెందిన నలుగురు మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు పోలీసుల ముందు లొంగిపోయారు. నక్సలైట్ల పనులు నచ్చక లొంగిపోయినట్లు వారు తెలిపారు.

maoist
నలుగురు మావోయిస్టు మిలీషియా స‌భ్యుల లొంగుబాటు
author img

By

Published : Jul 29, 2021, 9:24 PM IST

విశాఖపట్నం.. గూడెం కొత్త‌వీది మండ‌లానికి చెందిన న‌లుగురు మావోయిస్టు పార్టీ మిలీషియా స‌భ్యులు జీకేవీధి సీఐ అశోక్‌కుమార్ ముందు గురువారం లొంగిపోయారు. సీఐ అశోక్​కుమార్​ మాట్లాడుతూ అమ్మ‌వారిధార‌కొండ పంచాయ‌తీ పెబ్బంప‌ల్లి గ్రామానికి చెందిన కె.వెంక‌ట‌రావు, ముర్ల ల‌క్ష్మ‌య్య‌, ముర్ల రామారావు, కొర్రా మ‌త్స్య‌రాజులు కొంత‌కాలంగా మావోయిస్టు మిలీషియా స‌భ్యులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మావోయిస్టు అగ్ర‌నేత‌లు అరుణ‌, ఉద‌య్‌, కాకూరి పండ‌న్న అలియాస్ జ‌గ‌న్​తో బాటు మ‌రికొంత మంది త‌మ గ్రామాల‌కు వ‌చ్చిన‌ప్పుడు వారికి భోజ‌నం, వ‌స‌తి క‌ల్పించ‌డంతో బాటు పోలీసుల స‌మాచారం అందించేవారు.

దీనికి తోడు మావోయిస్టులు నిర్వ‌హించే స‌మావేశాల‌కు ప్రజలను పిలవడం, మీటింగులు ఏర్పాటు చేయడం, మావోయిస్టులు నిద్రించే సమయంలో రక్షణగా ఉండేవారు.

అంతేకాకుండా వేరే ఊరికి వెళ్లినప్పుడు ఆ ఊరికి వరకు దారి చూపించి వాళ్లని క్షేమంగా పంపడం వంటి పనులు చేసేవారు. అయితే మావోయిస్టులు చేస్తున్న ప‌నులు న‌చ్చ‌క, పోలీసులు చేస్తున్న అభివృద్ది ప‌నులు న‌చ్చి గురువారం గూడెం కొత్త వీధి సీఐ అశోక్​కుమార్, ఎస్​ఐ షమీర్, సీఆర్‌పీఎఫ్ 234 బెటాలియన్ స‌హాయ క‌మాండెంట్ బీరేందర్ కుమార్ స‌మ‌క్షంలో లొంగిపోయారు.

ఇదీ చదవండి: AOB: నేటి నుంచి ఆగస్టు 3 వరకు 'మావోయిస్టు అమర వీరుల వారోత్సవాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.