రోకలిని నిలబెట్టిన గ్రహణం విశాఖ మన్యంలోని కొయ్యూరు మండలం సింగరపాడులో మహిళలు సూర్యగ్రహణం రోజున ఓ పద్ధతిని పాటిస్తారు. ఇత్తడి ప్లేటులో పాలు పోసి గ్రహణం పట్టినప్పుడు రోకలి నిలబెడతారు. రాతి రోలుపై కూడా రోకలి అలానే నిలబెడతారు. ఈ విధంగా సూర్యుడికి భూమికి మధ్య ఉన్న గురుత్వాకర్షణ శక్తిని తమ పూర్వీకులు తెలుసుకునే వారని గిరిజనులు అంటున్నారు. గ్రహణం విడవగానే రోకలి పడిపోతుంది. సాంకేతికతలేని రోజుల్లో గ్రహణాన్ని ఈ పద్ధతుల ద్వారా తెలుసుకునే వారని గిరిజనులు చెబుతున్నారు.
ఇదీ చదవండి :
గ్రహణం లెక్క తేల్చిన రోకలి-సూదులు!