విశాఖ జిల్లాలోని పలు గ్రంథాలయాల్లో వేసవి శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. 40 గ్రంథాలయాల్లో ఈ శిబిరాలు నడుస్తున్నాయి. విద్యార్థులు గ్రంథాలయాలకు వచ్చి ఆనందంగా గడుపుతున్నారు. జూన్ 7వరకు ఈ తరగతులు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. కథలు చెప్పడం, రాయడం నేర్పించడం, చిత్రలేఖనం, ఆంగ్లంపై పట్టు సాధించేందుకు నైపుణ్య తరగతులు, ఆటల్లో తర్ఫీదు ఇస్తున్నారు. ఈ వేసవి శిబిరాలకు రావడానికి విద్యార్థులు ఇష్టపడుతున్నారు. ఉపయోగరకంగా ఉందని చెబుతున్నారు.
ఇదీ చదవండి...