నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన 2021-22 బడ్జెట్‌ను సబ్‌కలెక్టర్ నారపరెడ్డి మౌర్య ఆమోదించారు. ఈ మేరకు ప్రారంభ నిల్వ 11.62 కోట్ల రూపాయలు ఉండగా.. వివిధ పద్దుల కింద 32. 52 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. 35.59 కోట్లును ఖర్చు చేయగా.. ముగింపు నిల్వ 8.60 కోట్లుగా చూపారు. ఎన్నికల ప్రక్రియ అనంతరం మార్చి నెలలో కొత్త పాలకవర్గం కొలువు తీరనుంది. ఏప్రిల్ 1 నుంచి నూతన బడ్జెట్ అమల్లోకి రానుంది.
ఇదీ చదవండీ.. మార్చి 2 నుంచి 4 వరకు ఇండియా మారిటైం సదస్సు