స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో విద్యార్థి యువజన సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. మద్దిలపాలెంలోని తెలుగు తల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సాగిన మార్చ్ లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేస్తే.. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే రిజర్వేషన్లు కోల్పోతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజల హక్కులను హరించే విధంగా.. ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి..