విశాఖ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద.. తోపుడు బండ్లు, చిల్లర వర్తకుల కార్మిక సంఘం నిరసన చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 10 వేల రుణ సదుపాయానికి అర్హత కల్పించాలని డిమాండ్ చేసింది.
తోపుడుబండ్ల వ్యాపారం, చిల్లర వర్తకులకు 2019 సెప్టెంబర్ లో గుర్తింపు కార్డుల కోసం 850 మంది రుసుముతో సహా దరఖాస్తులు చేశామని, ఇప్పటి వరకు తమకు గుర్తింపు కార్డులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ అధికారులు 2018లో 3,600 మందికి గుర్తింపు కార్డులను రెన్యువల్ చేశారని.. వీరిలో 1000 మందికి కార్డులకు ఆధార్ అనుసంధానం జరగలేదని గుర్తు చేశారు.
కార్డు లేని వారికి, కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నెల రోజుల్లో గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. నిరసన కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు డి రవికుమార్, కార్యదర్శి ఏ సింహాచలం, సీఐటీయూ మద్దిలపాలెం జోన్ అధ్యక్షుడు వి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: