కరోనా వ్యాప్తితో లాక్డౌన్ కారణంగా వీధివీధి తిరిగి విక్రయాలు జరుపుకునే వ్యాపారులపై కోలుకోలేని దెబ్బపడింది. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. విశాఖలో టౌన్ వెండింగ్ కమిటీ సమావేశమై... ప్రభుత్వం తమకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరింది.
2014 వీధి వ్యాపారుల హక్కు చట్టం ప్రకారం.. విపత్తు సమయంలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని కమిటీ సభ్యుడు దుంగ శ్రీనివాస్ కోరారు. హుద్ హుద్ సందర్భంగా ఆనాటి ప్రభుత్వం వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు అందించిందని గుర్తుచేశారు.
ప్రస్తుత ప్రభుత్వం లాక్డౌన్ తో నష్టపోయిన ఒక్కో వీధి వ్యాపారికి 10వేల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: అమ్మ తనం... కంటనీరు పెట్టించింది