ETV Bharat / state

అంకుపాలెంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

author img

By

Published : Jan 27, 2021, 3:34 PM IST

విశాఖపట్నం జిల్లా అంకుపాలెంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. 13 జిల్లాలకు చెందిన మహిళ, పురుష జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.

kabaddi
అంకుపాలెంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

విశాఖ జిల్లా చోడవరం మండలం అంకుపాలెం గ్రామంలో కబడ్డీ రాష్ట్ర అసోసియేషన్ అధ్వర్యంలో మహిళ, పురుషుల కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో 13 జిల్లాలకు చెందిన మహిళ, పురుష జట్లు తలపడుతున్నాయి. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఉత్తరప్రదేశ్​లో జరిగే జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు కబడ్డీ రిఫరీల అసోసియేషన్ ఛైర్మన్ కె.బాలు, సమన్వయకర్త దాసులు పేర్కొన్నారు.

అంకుపాలెం గ్రామంలోని దుర్గదేవి తీర్థమహోత్సవం సందర్భంగా ఏటా కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను చోడవరం పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఇలియాస్ మహమ్మద్ ప్రారంభించారు.

ఇదీ చదవండి: చీడికాడలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.