రాష్ట్ర గురుకులాల కార్యదర్శి శ్రీకాంత్ ప్రభాకర్ విశాఖ మన్యంలో పర్యటించారు. అరకులోయలోని ఏకలవ్య మోడల్ పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఇక్కడ అత్యుత్తమ బోధన అందించేందుకు వీలుగా.. రెగ్యులర్ ప్రాతిపదికన 117 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 25 పాఠశాలలకు పూర్తి స్థాయి భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒక్కో విద్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 25 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.
అరకులోయలోని ముంచంగిపుట్టు, డుంబ్రిగూడ, ఏకలవ్య పాఠశాల భవనాల నిర్మాణంలో జాప్యం జరిగిందని శ్రీకాంత్ చెప్పారు. త్వరలోనే ఆయా నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక గురుకుల క్రీడా పాఠశాలకు పూర్తిస్థాయి భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం 20 ఎకరాలు గుర్తించినట్లు చెప్పారు. పాఠశాలకు ఆ స్థలాన్ని ఇంకా అప్పగించ లేదన్నారు. ఈ ప్రక్రియ పూర్తైతే త్వరలోనే నిర్మాణాలు ప్రారంభిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: