ETV Bharat / state

అనకాపల్లి బెల్లం మార్కెట్​ మూసివేత - అనకాపల్లి బెల్లం మార్కెట్ మూసివేత న్యూస్

వ్యాపారులు, హమాలీల (కొలగార్లు) మధ్య చర్చలు విఫలమైన కారణంగా.. విశాఖ జిల్లా అనకాపల్లి బెల్లం మార్కెట్​లో లావాదేవీలు నిలచిపోయాయి.

anakapalli jaggery
అనకాపల్లి బెల్లం మార్కెట్​లో నిలిచిన అమ్మకాలు
author img

By

Published : Sep 28, 2020, 10:14 PM IST

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విశాఖ జిల్లా అనకాపల్లి బెల్లం మార్కెట్​లో లావాదేవీలు నిలిచిపోయాయి. వ్యాపారులు, కొలగార్లకు మధ్య చర్చలు విఫలమైన కారణంగా.. సోమవారం బెల్లం మార్కెట్​ను మూసివేశారు.

మార్కెట్​లో బెల్లం కొనుగోలు చేసే వ్యాపారుల వద్ద కొలగార్లు పనిచేస్తుంటారు. ఒక వ్యాపారి వద్ద యార్డులో పనిచేసే కొలగారి.. మిగిలిన యార్డుల్లో వెళ్లకుండా పనిచేస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని మార్చి.. యూనియన్ సభ్యులు ఒక దగ్గరే కాకుండా.. మార్కెట్​లో ఏ వ్యాపారి వద్దనైనా పని చేయవచ్చునని, కొలగార్ల యూనియన్ సభ్యులు నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు వ్యాపారులు ఒప్పుకోవటం లేదు. సంవత్సరాలుగా ఉన్న సంప్రదాయాన్ని మార్చకూడదని వారు పట్టుపడుతున్నారు. కొలగార్లు, వ్యాపారు మధ్య సయోధ్య కుదరకపోవటంతో యార్డు మూతపడింది.

ప్రస్తుతం మార్కెట్​కి రోజుకి 1500 నుంచి 2000 వరకు బెల్లం దిమ్మెలు వస్తున్నాయి. సీజన్ ప్రారంభం అవుతున్న సమయంలో ఈ వివాదం సమస్యగా మారింది. మార్కెట్​ ఇంకెన్నిరోజులు మూతపడి ఉంటుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై మార్కెటింగ్ అధికారులు దృష్టి సారించి.. పరిష్కరించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

రాంగ్ రూట్ లో వెళ్లి దబాయింపు.. అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.