అరకు లోయలో ఎస్టీ శాసనసభ కమిటీ పర్యటన - ఎస్టీ శాసనసభ కమిటీ వార్తలు
విశాఖ జిల్లా అరకు లోయ ప్రాంతంలో రాష్ట్ర ఎస్టీ శాసనసభ కమిటీ పర్యటించింది. కమిటీ ఛైర్మన్ తెల్లం బాలరాజు, ఎమ్మెల్యేలు ఫాల్గుణ భాగ్యలక్ష్మి, నాగులపల్లి ధనలక్ష్మి, తలారి వెంకట్రావులు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఐటీడీఏ పీవో బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో వివిధ శాఖల్లో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల తీరును అధికారులు కమిటీకి విన్నవించారు. గిరిజన ప్రాంతంలో సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా కమిటీ చర్యలు చేపడుతుందని బాలరాజు అన్నారు. గిరిజనులకు ఉద్దేశించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్ని శాఖల్లోనూ అమలు చేయాలన్నారు. భూ బదలాయింపు చట్టం, పీసా చట్టం జీవో నెంబర్ -3 లను అమలు చేసేందుకు కమిటీ చర్యలు చేపడుతుందన్నారు