విశాఖ జిల్లా చోడవరంలో శ్రీనివాసుని కల్యాణం కన్నుల పండువగా జరిగింది. తితిదే జిల్లా సమన్వయ కర్త సుదర్శనం సీతారామాచార్యుల ఆధ్యాత్మిక ప్రవచనాల నడుమ తిరుమల నుంచి వచ్చిన అర్చకులతో ఆగమ సంప్రదాయ పద్ధతిలో కల్యాణం జరిపించారు. స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అన్నమయ్య కీర్తనలు, చిన్నారుల నృత్యాలు ఈ వేడకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇదీచదవండి.