పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం పీఠాధిపతులు శ్రీ అభినవొద్దండ విద్యా శంకర భారతి స్వామి విశాఖలో పర్యటించారు. సీతమ్మధారలోని త్రిమూర్తక వెంకటేశ్వర ఆలయంలో స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైందవ ధర్మానికి ఆలయాలే పునాదులని..,సనాతన సంస్కృతికి ఉపిరి ఆలయాలేనన్నారు. ధర్మాన్ని రక్షిస్తే..ధర్మం మనల్ని కాపాడుతుందని స్పష్టం చేశారు.
ఆదివారం అరసవల్లి, రామతీర్థ ఆలయాలను సందర్శిస్తానాన్ని స్వామీజీ ప్రకటించారు. ప్రతి హిందువు స్వేచ్ఛగా తిరిగే వరకు యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. దేవాలయాలుపై దాడుల నివారణకు ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఆచార్య సభ నిర్వహిస్తానని..,హిందూ పరిరక్షణ కోసం పరిశ్రమిస్తానని స్వామీజీ అన్నారు.
ఇదీచదవండి