విశాఖ జ్ఞానాపురానికి వెళ్లే రహదారిలో హార్బర్ పోలీసు స్టేషన్ ఉంది. జ్ఞానాపురం అంటే విశాఖ వాసులకు వెంటనే గుర్తుకు వచ్చేది 'చావుల మదుం' జంక్షన్. వాస్తవంగా ఆ జంక్షన్ పేరు 'చావల్ మదుం'. అయితే ఆ ప్రాంతంలో నగరంలోనే పెద్దదైన శ్మశాన వాటిక ఉంది. అందుకే చావల్ మదుం కాస్తా చావుల మదుం అయింది. నిత్యం అక్కడికి దాదాపు 10 మృతదేహాల వరకు అంత్యక్రియల కోసం తీసుకొస్తుంటారు. అయితే ఇక్కడే వచ్చింది చిక్కు.
శ్మశాన వాటికకు చేరుకోవాలంటే ఆ హార్బర్ పోలీస్ స్టేషన్ ఎదురుగుండానే వెళ్లాలి. హిందువుల్లో ఒక ఆచారం ఉంది. మనిషి చనిపోయాక అంత్యక్రియల కోసం తీసుకెళ్లేటప్పుడు 'దింపుడు కళ్లెం' పేరుతో దారిలో ఒకచోట పాడెను ఆపి శవాన్ని దించుతారు. ఈ ప్రక్రియ సరిగ్గా పోలీస్ స్టేషన్ ఎదురుగానే జరుగుతోంది. మృతదేహాలను తీసుకెళ్లేవారు స్టేషన్ దగ్గరకు రాగానే దింపుడు కళ్లెం కోసం దించుతున్నారు. ఇది పోలీసులకు, సిబ్బందికి ఇబ్బందిగా మారింది. రోజులో 2 గంటలకొకసారి చొప్పున వారికి ప్రతిరోజు ఇదే దృశ్యం ఎదురవుతోంది. ఇది భరించలేని స్టేషన్ సిబ్బంది.. పాడెను ఇక్కడ ఆపొద్దంటూ స్టేషన్ ముందు బోర్డు పెట్టారు.
ఇదీ చదవండి...