వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలతో విశాఖ జిల్లా మాడుగుల ఎక్సైజ్ కార్యాలయం ఆవరణం నిండిపోతోంది. కొన్నేళ్లుగా పట్టుబడిన వాహనాలు ఎండకి ఎండుతూ... వానకి తడుస్తూ.. తుప్పు పడుతున్నాయి. కొన్ని మట్టిలో కూరుకుపోతున్నాయి.. ఇంకొన్ని వాహనాలపై మొక్కలు, పొదలు పెరుగుతున్నాయి. పాడైపోతున్న వాహనాల్లో ఆటోలు, కార్లు, బైకులు, జీపులు, లారీలున్నాయి. ఈ వాహనాలన్నీ గంజాయి, సారా ఇతర అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడ్డాయి. వీటి పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ పట్టించుకున్న నాథుడు లేడు.
ఇవీ చూడండి...