విశాఖ ఏజెన్సీలో పంచాయతీ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో చాలామంది విఫలమయ్యారు. ఏజెన్సీలో సుమారు ఆరు శాతం వరకు ఓట్లు.. అవగాహన లేక, ఓటు వేయడం తెలియక రద్దయ్యాయి. అధికారులు ప్రజలకు పోలింగ్, ఓటు పట్ల అవగాహన కల్పించి ఉంటే.. ఫలితాలు వేరేలా ఉండేవని ఓడిపోయిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాడేరులో 5007 ఓట్లు ఉంటే.. 4730 ఓట్లు పోలయ్యాయి. 22నోటాకీ వేశారు. మిగతా 255 ఓట్లు.. బ్యాలెట్ పత్రాలపై వేలిముద్రలు, అన్ని గుర్తులపై ముద్రలు వేయడం, ఓటు వేసిన గుర్తుభాగాన్ని కత్తిరించి ఓటర్ పట్టుకెళ్లిపోవడం, రెండు వైపులా గుర్తులపై ఓటు వేయడంతో అవన్నీ లెక్కలోకి తీసుకోలేదు అధికారులు. పాడేరులోనే ఇలా ఉంటే.. మిగత ఊర్లలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
డిక్లరేషన్లు ఇవ్వకపోవడంతో..
చాలామంది ఉద్యోగులు వారు ఎన్నికల విధుల్లో ఉండడంతో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. డిక్లరేషన్లు ఇవ్వలేదు. వార్డ్ సభ్యుల ఓట్లలో.. 199, సర్పంచ్ ఓట్లలో 180 పనికిరాకుండా పోయాయి. అధికారులు కనీసం అవగాహన కల్పిస్తే... ఇలా జరిగేది కాదని కొంతమంది అంటున్నారు.
ఇదీ చూడండి.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బ్యాలెట్ బాక్సులు!