ETV Bharat / state

విద్యుత్ ఉత్పత్తిని తగ్గించిన సింహాద్రి విద్యుత్ కేంద్రం - సింహాద్రి విద్యుదుత్పత్తి కేంద్రం వార్తలు

విశాఖలోని ఎన్టీపీసీ బొగ్గు ఆధారిత విద్యుత్తుత్పత్తి కేంద్రం సింహాద్రి ఇప్పుడు డిమాండ్ లేక ఉత్పత్తిని మూడో వంతుకు త‌గ్గించుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విద్యుత్తు డిమాండ్ లేక‌పోవ‌డం ఇందుకు ప్రధాన కార‌ణంగా తెలుస్తోంది. తాత్కాలిక రిజ‌ర్వ్ ష‌ట్ డౌన్ కింద 1500 మెగావాట్ల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేసింది.

simhadri-power-plant-in-vizag-district
సింహాద్రి పవర్ ప్లాంట్
author img

By

Published : Sep 23, 2020, 8:21 PM IST

లాక్ డౌన్ ప్రభావానికి వర్షాకాలం తోడు కావ‌డం విద్యుత్తు డిమాండ్ ప‌డిపోవ‌డం ఇప్పుడు థర్మల్ విద్యుత్తు కేంద్రాల‌కు గిరాకీ త‌గ్గిపోయింది. విశాఖ జిల్లాలోని ప‌ర‌వాడ‌లో ఎన్టీపీసీకి ఉన్న అతి ముఖ్యమైన యూనిట్ల‌లో సింహాద్రి థర్మల్ ప‌వ‌ర్ స్టేష‌న్ ఒక‌టి. 2 వేల మెగావాట్ల సామ‌ర్ధ్యం గ‌ల ఈ ప‌వ‌ర్ స్టేష‌న్​లో 4 యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 500 మెగావాట్ల సామ‌ర్థ్యం గల ఈ యూనిట్లు ఈనెల మొద‌టి వారం వ‌ర‌కు పూర్తిస్ధాయిలోనే పనిచేశాయి. 10 రోజుల కింద‌ట ఒక‌టో యూనిట్​లో విద్యుత్తు ఉత్పత్తిని నిలిపారు. 18వ తేదీన 3, 4 యూనిట్లు రెండింటిలోనూ విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేశారు.‌ విద్యుత్తు డిమాండ్ గ‌ణ‌నీయంగా త‌గ్గడం వ‌ల్లనే ఎన్టీపీసీ సింహాద్రి ఈ చ‌ర్యలు చేప‌ట్టింది.

సింహాద్రిలో ఉన్న 1, 2 యూనిట్లు వెయ్యి మెగావాట్ల విద్యుత్తులో ఆంధ్రప్రదేశ్​కి 461 మెగావాట్లు, తెలంగాణకి 539 మెగావాట్ల‌ను కేటాయించారు. అంటే 46.1 శాతం ఆంధ్రప్రదేశ్​కి, 53.9 శాతం తెలంగాణకి పంచారు. ఇప్పుడు ఈ 2 యూనిట్ల‌లో కేవ‌లం ఒక‌టి మాత్రమే 500 మెగావాట్ల‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇది కూడా ఆ దామాషా ప్రకారమే 2 రాష్ట్రాలు వినియోగించుకోవాల్సి ఉంటుంది. 3, 4 యూనిట్ల‌లో ఉత్పత్తి అయ్యే 1000 మెగావాట్ల విద్యుత్తును ఆంధ్రప్రదేశ్, తెలంగాణల‌తో పాటుగా క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, పుదుచ్చేరిల‌కు కూడా వాటా ఉంది. తెలంగాణకి 245 మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్​కి 209.6 మెగావాట్లు, త‌మిళ‌నాడు 224.8, క‌ర్ణాట‌క 212.3, కేర‌ళ 91.5, పుదుచ్చేరి 16.7 మెగావాట్ల‌ కేటాయింపులు ఉన్నాయి. ఈ 3, 4 యూనిట్లు రెండింటిలోనూ విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేశారు.

ప‌్రతిష్ఠాత్మకమైన ఈ ప్లాంట్​లో ఉత్పత్తయ్యే విద్యుత్తు ద‌క్షిణాది గ్రిడ్​కి వెళ్తుంది. అక్కడినుంచి ఆయా రాష్ట్రాలు త‌మ అవ‌స‌రాల మేర‌కు వాటా ప్రకారం వినియోగిస్తాయి. ప్రస్తుతం వీటి నుంచి, కేంద్రం నుంచి డిమాండ్ లేక‌పోవ‌డం వ‌ల్ల ఎన్టీపీసీ సింహాద్రి ఈ నిర్ణయం తీసుకుంది. మ‌రోవైపు ఇక్కడ విద్యుత్తు ఉప ఉత్పత్తిగా వ‌చ్చే ఫ్లై యాష్ వినియోగం బాగా పెరిగింది. పెందుర్తి అన‌కాప‌ల్లి 6 లైన్ల జాతీయ ర‌హ‌దారి కోసం ఈ ప్లై యాష్ పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. రోజుకు 500లకు పైగా లారీలు ఈ ప్లై యాష్ ర‌వాణా చేసే ప‌నిలో ఉన్నాయి.

ఇవీ చదవండి..

స్వచ్ఛభారత్‌-2020 ప్రధాన మంత్రి అవార్డు రేసులో విశాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.