విశాఖలోని సింహాచలం అప్పన్న ఆలయ భూముల వ్యవహారంపై ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి వై.శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు కమిషనర్ ఆజాద్ నివేదిక ఆధారంగా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అక్రమ కట్టడాలకు శ్రీనివాసరావు అనుమతులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల ఆధారంగా సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: