విశాఖలోని సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహ కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రేపటి స్వామి వారి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కల్యాణ ఘట్టాన్ని తిలకించడానికి రాష్ట్ర నలుమూలల భక్తులు తరలి వస్తుంటారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. సింహాచలం కొండపైన ప్రత్యేకమైన క్యూలైన్లు, సింహగిరిపైకి బస్సు సదుపాయం కల్పించారు. రేపు రాత్రి 8 గంటలకు స్వామివారి రథయాత్ర జరగనున్నది. ఈ యాత్రలో స్వామివారిని రథంపై అధిష్టింపచేసి ఆలయ గాలిగోపురం చుట్టూ ఊరేగిస్తారు. రథయాత్ర అనంతరం తొమ్మిదిన్నర గంటలకు కల్యాణ మహోత్సవం జరగనుంది. స్వామి వారి కల్యాణ మండపాన్ని సుందరంగా పుష్పాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు దంపతులు పాల్గొంటారు.
ఇవీ చూడండి : ఐటీ గ్రిడ్ వ్యవహారంపై లోతైన విచారణ జరిపించాలి: దాడి