సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నుంచి వేరు చేసిన చందనాన్ని దేవస్థానం గురవారం నుంచి విక్రయాలు ప్రారంభించింది. ఒక ప్యాకెటు పది రూపాయలకు విక్రయించాలని నిర్ణయించారు. కొండ దిగువున సీఆర్వో కార్యాలయం వద్ద దర్శనం టోకెన్లను కూడా జారీ చేస్తున్నారు. సింహగిరిపై దర్శనం అనంతరం ప్యాకెట్లు భక్తులకు అందజేసే ఏర్పాటు చేశారు. ఒక భక్తుడికి ఒక ప్యాకెటు చొప్పున రోజుకి 500 ప్యాకెట్లు విక్రయిస్తున్నట్టు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.
స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకునే భక్తులకు ప్రతిరోజు మూడు వందల మందిని మాత్రమే అనుమతిస్తామని దేవస్థానం ఈవో తెలిపారు. తలనీలాలు సమర్పించాలనుకునే భక్తులు ఉదయం 6 నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సీఆర్వో కార్యాలయం వద్ద టోకెన్లు తీసుకోవాలని సూచించారు. స్లాట్ విధానంలో టిక్కెట్లు ఇస్తామన్నారు.