మహాశివరాత్రి జాతర సందర్భంగా విశాఖ జిల్లా రావికమతం మండలం పోతురాజు బాబు ఆలయానికి భక్తులు 2వ రోజు పోటెత్తారు. ఈ ఉత్సవాలు రేపటి వరకు కొనసాగుతాయి. ఇక్కడ ఆలయం దర్శనానికి ముందు కళ్యాణలోవ జలాశయంలో పుణ్యస్నానాలు ఆచరించి.. పోతురాజు బాబు, పెద్దింటమ్మ ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారు.
ఈ నెల 10వ తేదీ నుంచి విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్టీసీ డిపోల నుంచి సుమారు 80 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులు ఇక్కడకు చేరుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. కొత్తపేట సర్కిన్ ఇన్స్పెక్టర్ లక్ష్మణమూర్తి సారథ్యంలో సుమారు 300 మంది పోలీసులను భధ్రత ఏర్పాట్ల నిమిత్తం అందుబాటులో ఉంచారు.
ఇదీ చూడండి: అబ్బో.. ఈ కంద ఎంత పెద్దదో