విశాఖ గ్రామీణ ప్రాంతంలో కుక్కల బెడద అధివుతోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మనుషుల్నే కాదు చివరికి పశువులు శునకాల బారిన పడుతున్నాయి. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో శనివారం తెల్లవారుజామున మేకలు, గొర్రెల మందపై కుక్కలు దాడిచేశాయి. గ్రామసింహాల దాడిలో మొల్లి ఎర్రిబాబు అనే వ్యక్తికి చెందిన తొమ్మిది గొర్రెలు మృతి చెందగా.. మేకలు కుక్కకాటుకు గురయ్యాయి.
నాలుగు నెలల కిందట వడ్డాది గ్రామంలో కుక్కలు కరవడంతో 100 మేకలు, గొర్రెలు చనిపోయాయి. తరుచూ కుక్కల వల్ల తమ ఆస్థిని నష్టపోతున్నామని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన మేకలు, గొర్రెల యాజమానిని వైకాపా నాయకుడు దొండా నారాయణ మూర్తి పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటాననని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: వివాహ సారె వేడుకకు వెళ్తుండగా ప్రమాదం... వరుడు మృతి