విశాఖ జిల్లా గాజువాకలో కుంచమంబ కాలనీకి చెందిన రొంపల్లి గీత అనే మహిళ ఎంఏ, బీఈడీ చదివారు. ఉపాధ్యాయ పోటీ పరీక్షలు రాసి ఉద్యోగం పొందారు. గతేడాది మార్చి28న ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు పరీక్షలలో ఎంపికయ్యారు. మంత్రి పినిపే విశ్వరూప్ నుంచి నియామక ఉత్తర్వుల పత్రం కూడా అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని చొల్లంగిపేట బాలయోగి గురుకులంలో గత నెల 15న విధుల్లో చేరారు. ఎన్నో ఆశలతో ఉద్యోగంలోకి చేరిన ఆమెకు చేదు వార్త తెలిపారు అధికారులు.
13 రోజుల తర్వాత ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రతిభావంతుల జాబితాలో గీత కంటే ముందున్న మహిళకు మార్కులు తక్కువగా నమోదయ్యాయని.. తప్పు సరిచేయటంతో ఆమెకు ఉద్యోగం దక్కుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందువల్ల ఉద్యోగం నుంచి తప్పుకోవాలని చెప్పారు. ఈ విషయమై మంత్రి విశ్వరూప్‌ను కలిసినా ప్రయోజనం దక్కలేదని గీత కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చదవండి:మేస్త్రి అవతారమెత్తిన మాజీ మంత్రి