ETV Bharat / state

రూ. 41 లక్షలతో శారదా నది కాజ్​ వే పనులు - శారదా నది కాజ్​ వే పనులు వార్తలు

శారదా నదిపై విశాఖ జిల్లా దేవరాపల్లి వద్ద అసంపూర్తిగా ఉన్న వంతెనను రూ.41 లక్షలతో పూర్తి చేయనున్నట్లు ఆర్​అండ్​బీ ఎస్​ఈ కేశవరావు స్పష్టం చేశారు. పనులను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు.

రూ. 41 లక్షలతో శారదా నది కాజ్​ వే పనులు
రూ. 41 లక్షలతో శారదా నది కాజ్​ వే పనులు
author img

By

Published : Oct 23, 2020, 10:57 PM IST

విశాఖ జిల్లా దేవరాపల్లి వద్ద శారదా నదిపై అసంపూర్తిగా ఉన్న వంతెనను రూ.41 లక్షలతో పూర్తి చేయనున్నట్లు ఆర్​అండ్​బీ ఎస్​ఈ కేశవరావు స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైవాడ జలాశయం నుంచి శారదా నదిలోకి నీరు వదలటంతో నది కాజ్​వే పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో అనంతగిరి, హకుంపేట మండలాలకు చెందిన దాదాపు 100 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజల ఇబ్బందులపై ఈటీవీ-ఈటీవీ భారత్​లో ప్రచురితమైన కథనాలకు స్థానిక ఎమ్మెల్యే ముత్యాలనాయుడు స్పందించారు. కాజ్​వే అసంపూర్తి వంతెనను నాలుగు రోజుల క్రితం అధికారులతో కలిసి పరిశీలించారు. ​

తాజాగా అర్​అండ్​బీ ఎస్​ఈ కేశవరావు కాజ్ వే ను పరిశీలించి...అసంపూర్తిగా ఉన్న వంతెనను పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఈ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు.

ఇదీచదవండి

మురికి కూపంలో రాజీవ్ గృహకల్ప ఇళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.