ఎస్పీ బాలసుబ్రమణ్యం శివైక్యం పొందటం బాధాకరమని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ అన్నారు. సంగీతమే ఊపిరిగా బాలు జీవించారనీ.. బాలు మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు. విశాఖ శారదాపీఠంతో ఆయనకు ఎంతో మంచి అనుబంధం ఉందనీ.. శ్రీశైలం వెళ్తే.. శారదాపీఠం ఆశ్రమంలోనే బాలు ఉండేవారని గుర్తు చేసుకున్నారు. గొప్ప ఆధ్యాత్మిక భావాలున్న సంగీత శికరం బాల సుబ్రమణ్యం అనీ.. ఆయన ఆత్మ భగవంతుని పాదాల వద్దకు చేరుకోవాలని కోరుకుంటున్నాని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తమ్ముడు అని ఆత్మీయంగా పిలిచేవారు : మిథునం నిర్మాత