విశాఖ జిల్లా దేవరాపల్లి వద్ద శారదా నదిపై ఉన్న కాజ్ వే వరదనీటి ఉద్ధృతికి బుధవారం పూర్తిగా కొట్టుకుపోయింది. రైవాడ జలాశయం గేట్లు ఎత్తి అదనపు నీటిని శారదా నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రరూపంతో ప్రవహిస్తున్న శారదా నదిపై ఉన్న కాజ్ వే కొట్టుకుపోయింది.
కాజ్ వే పనులకు మరమ్మతులు..
నదికి అటు వైపున దేవరాపల్లి, అనంతగిరి, హుకుంపేట మండలాలకు చెందిన దాదాపు 100 వరకు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి కాజ్ వే పనులకు మరమ్మతులు చేపట్టాలని... నదిపై అసంపూర్తిగా ఉన్న వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజల కోరుతున్నారు.