భాష, సాహిత్యాలు ఒక దేశ సంస్కృతి, ఔన్నత్యం, అభివృద్ధిని ప్రతిబింబిస్తాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య వి కృష్ణ మోహన్ అన్నారు. విశ్వవిద్యాలయం మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'భాష- సాహిత్యం' పునఃశ్చరణ తరగతులను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు, ఇతర ఆచార్యులు పాల్గొన్నారు.
ఆక్వా రంగంలో ఉద్యోగ అవకాశాలపై మరో సదస్సు
ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే చదువుతోపాటు విషయ పరిజ్ఞానం, పలు భాషలపై పట్టు ఉండాలని ఆంధ్ర యూనివర్సిటీ వీసీ అన్నారు. ఆక్వారంగంలో ఉద్యోగ అవకాశాలు-సవాళ్లు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో వీసీ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఆక్వా రంగంలో ఎక్కువగా ఎగుమతులు ఉన్న కారణంగా... పలు భాషలపై అవగాహన పెంచుకోవలని విద్యార్థులకు సూచించారు. ఉపాధికి అవసరమైన అన్ని రకాల కోర్సులను నేర్పించేందుకు ఆంధ్ర యూనివర్సిటీలో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: