ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో అక్రమంగా నగదు తరలిస్తోన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లా లమతపుట్టు వద్ద సరిహద్దులోని భద్రతా బలగాలు తనిఖీ చేస్తుండగా జయపురం నుంచి ముంచంగిపుట్టు మండలం గతురుముండ వైపు వెళ్తున్న స్కార్పియో వాహనంలో... సుమారు 52 లక్షలు రూపాయలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు గంజాయి క్రయ విక్రయాలకు సంబంధించినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నగదును లమతపుట్టు పోలీస్ అవుట్‌పోష్టుకు అందజేశారు.
ఇవీ చూడండి: