Sanitary Inspectors Agitation: విశాఖపట్నంలో వార్డు సెక్రటరీల వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ సచివాలయ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆందోళన చేపట్టారు. యూజర్ చార్జీల వసూలు పేరుతో వార్డు సెక్రటరీలు తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇతర శాఖల సచివాలయ సిబ్బందితో సమానంగా విధులు అప్పగించకుండా.. ఉదయం 6 నుంచి సాయంత్రం వరకు వార్డులో తిరిగే పని అప్పజెప్పడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తపరిచారు. పని ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే బద్వేల్లో ఒక ఉద్యోగి ఆత్మహత్య చేసుకోగా.. అనేకమంది ఇదే పరిస్థితుల్లో ఉన్నారని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఇవీ చదవండి: