విశాఖ జిల్లాలో కొవిడ్ టీకా పంపిణీ జరుగుతోంది. గ్రామీణ జిల్లాలో ఎంపిక చేసిన 37 ఆరోగ్య కేంద్రాలు, నగరంలో 12 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. కేవలం కొవిషీల్డ్ రెండో డోసు మాత్రమే ఇస్తున్నారు. మెసేజ్ లేదా వాక్సినేషన్ స్లిప్స్ అందినవారికి మాత్రమే రెండో డోసు వేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
టీకా కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. వ్యాక్సిన్ వేసుకున్న తరువాత 30 నిమిషాలు.. వారిని పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు. టీకా వేయించుకునేందుకు అధిక సంఖ్యలో జనం వస్తున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:
'రెండో దశలో అతివేగం.. ప్రాణవాయువు నిల్వలను కచ్చితంగా అంచనా వేయాలి'